సిడ్నీలోని 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఉత్తమ విధానాల అమలు ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రతిష్ట అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ బుధవారం మాట్లాడుతూ శాసనసభ కమిటీ పనితీరుకు మరింత పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. అయితే చట్టాలపై సమగ్ర చర్చకు తగినంత సమయం దొరక్కపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.