దేవరాపల్లి కస్తూర్బా పాఠశాలలో నెలకున్న సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన బిల్డింగ్, నిరుపయోగంగా ఉన్న సోలార్, బాత్ రూమ్ లు, ఉపాద్యాయులు కోరత, చాలి చాలని గదులు వంటి సమస్యలతో విద్యార్దునులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాఠశాలలో 259 విద్యార్థునులు ఉన్నారన్నారు.