1940 నుంచి వస్తున్న అనవాయితీని కూటమి ప్రభుత్వం మంటల్లో కలిపిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ‘1940 నుంచి అన్ని రాష్ట్రాల్లో పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇస్తారు. సంఖ్యలతో పని లేకుండా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని ఇవ్వకుండా ఏదో కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. పదవి అనేది అలంకరణ కోసం కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.’ అని అన్నారు.