విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) లీజులు, వివిధ ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో విజిలెన్స్ కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈకమిటీ గురువారం విశాఖ రానుంది. తొట్లకొండ వద్ద గల బే వాచ్, రుషికొండలో రెస్టారెంట్, భీమిలి సమీపాన కంటెయినర్ రెస్టారెంట్ మేర్లిన్ కేఫ్, బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ ఆరా తీయనుంది.