మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారిక కార్యాలయాన్ని బుధవారం చోడవరం కోఆపరేటివ్ కాలనీలో ప్రారంభించారు. ఆయన సతీ సమేతంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం జరిపారు. మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కాగా కూటమి కార్యకర్తలు, నాయకులు ఇకనుంచి ఈ కార్యాలయాన్ని ఏ అవసరం అయినా సంప్రదించమన్నారు.