పద్మాపురం గ్రామ పంచాయితీ & స్థానిక పంచాయితీ సర్పంచ్ ఆధ్వర్యంలో రూ. 3 లక్షల 15వ ఫైనాన్స్ నిధులతో నూతనంగా నిర్మించిన రచ్చ బండను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో సభలు నిర్వహించడం ప్రజలకు ఉపయోగ కరంగా ఉంటుందని అన్నారు. అనంతరం రచ్చ బండ నిర్మించడంలో సహకరించిన పద్మపురం సర్పంచ్ పెట్టెలీ సుస్మితాను ప్రత్యేకంగా అభినందించారు.