ఆరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎలక్ట్రికల్ సూపర్డెంట్ ఇంజనీర్ ప్రసాద్. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కండ్రుం పంచాయితీ సర్పంచ్ కిముడు హరి, ఎలక్ట్రికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.