డీఐజీ గోపీనాథ్ జెట్టి అరకులోయ పోలీస్ స్టేషను సోమవారం అకస్మికంగా సందర్శించారు. క్రైమ్ రికార్డులను పరిశీలించి, కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వచ్చే 3 నెలలు టూరిస్ ల భద్రతకు హోటల్స్, రిసార్ట్స్, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్సై గోపాలరావుకు తెలిపారు. గంజాయి, సారా దుష్ప్రభావాలపైన, మహిళలపై నేర నివారణకు రెగ్యులర్ గా గ్రామాల్లో, విద్యాసంస్థలో అవగాహణ కల్పించాలని సూచించారు.