అనంతగిరి: చిలకలగెడ్డ గ్రామ సచివాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎన్.సూర్యలక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండకుండా ఎవరైనా బాలికలకు పెళ్లి చేస్తే చట్టపరంగా శిక్షించబడతారని తెలిపారు. సచివాలయం కార్యదర్శి, మహిళా పోలీస్ సంబంధిత కమిటీ ద్వారా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.