రౌడీషీటర్లు లేని విశాఖే తమ ధ్యేయమని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం పోలీసు కమిషనరేట్లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రౌడీ షీటర్లు జైలులో ఉండాలి. లేదా జిల్లా బయట ఉండాలన్నదే మా అభిమతమన్నారు. రౌడీలంతా జిల్లా వదిలిపారిపోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు