ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నెహ్రూ బజార్ వద్ద జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మాత్రమే అయినప్పటికీ, ప్రజల గుండెల్లో నిలిచిపోయే ముఖ్యమైన హామీలు నెరవేర్చామని తెలిపారు.