మాధవధార శ్రీ మాధవ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఆలయ అర్చకులు వరాహ నరసింహస్వామి మంగళవారం ఉదయం ఆలయం ఆలయ తలుపులు తీయడానికి ప్రయత్నించే లోపే ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. స్వామివారి విగ్రహాలకు ఉండవలసిన ఉండవలసిన బంగారం, వెండి ఆభరణాలు లేకపోవడం చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం ఆలయానికి చేరుకొని దొంగతనం జరిగిందని నిర్ధారించారు.