విశాఖపట్నం జిల్లాలో గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వర్షపాతం వివరాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా సగటున 34. 9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అని ఇందులో అత్యధికంగా సీతమ్మధార ప్రాంతంలో 62. 6 కురవగా అత్యల్పంగా పద్మనాభం మండలంలో 6. 2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహారాణిపేట 58. 4, పెదగంట్యాడ 39. 6, గోపాలపట్నం 38. 6, గాజువాక 36. 4 నమోదయింది.