పాలసీలపై బోనస్ పెంచాలని, జిఎస్‌టి రద్దు చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డివిజనల్ అధ్యక్షులు బి. తిరుమలరావు, కార్యదర్శి ఎన్‌విఆర్. వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఎల్‌ఐసి బిల్డింగ్ నూతన ప్రాంగణంలో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పాలసీలపై ఏజెంట్ల కమిషన్‌ను పెంచాలన్నారు.