వేపాడ: 25 నుండి సమ్మెకు సిద్ధమన్న 108 సిబ్బంది

77பார்த்தது
వేపాడ: 25 నుండి సమ్మెకు సిద్ధమన్న 108 సిబ్బంది
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేపాడ 108 వాహన సిబ్బంది గురువారం తహసిల్దార్ జె. రాములమ్మ, ఎంపీడీవో సిహెచ్ సూర్య నారాయణకు వినతిపత్రం అందజేశారు. 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, జీవో నెంబర్ 49 ద్వారా ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఈ నెల 25 నుండి సమ్మె చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி