ఎస్. కోట నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 వ తేదీన పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లును పరిశీలించేందుకు కొత్తవలస మండలం దెందేరులో కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తో కలసి ఆమె పర్యటించారు. రూ. 826 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల్లో గోతులు పూడ్చే పనులకు ఇక్కడ నుండే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.