ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యవంతంగా జీవించాలని ఎంపీపీ సండి సోమేశ్వరరావు అన్నారు. ఎస్ కోట పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రపంచ టాయిలెట్ దినోత్సవం లో ఆయన సర్పంచ్ సంతోషి కుమారి తో కలిసి పాల్గొన్నారు. బహిరంగ మలవిసర్జన పంచాయతీగా ఎస్. కోట పంచాయతీని తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ సంతోషి కుమారి అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను దుస్సాలువలతో సత్కరించారు. ఈవో అనురాధ తదితరులు పాల్గొన్నారు.