కొత్తవలస మండలం మంగళ పాలెం లోని శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ అన్నారు. శనివారం ఆయన ట్రస్ట్ ను సందర్శించి ట్రస్టులో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వ్యవస్థాపకులు రాపర్తి జగదీష్ బాబు ను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల పట్ల జగదీష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమన్నారు. అనంతరం ట్రస్టులో పేద ప్రజలకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు.