పల్లె నిద్రలో భాగంగా పాచిపెంట మండలం పి. కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం సందర్శించారు. జిల్లాలోని గిరిజన, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో గల అన్ని ఎస్. సీ, ఎస్. టీ, బీసీ వసతి గృహాలను బలోపేతం చేసేందుకు వసతి గృహ డార్మెటరీలో జిల్లా కలెక్టర్ రాత్రి నిద్రించారు.