పార్వతీపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విఒఎలు ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఒఎలు బుధవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తొలగించిన విఒఎలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జ్యోతి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.