పార్వతీపురం మన్యం జిల్లా శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర మంగళవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్ లో మాట్లాడారు. పార్వతిపురం జిల్లా అయ్యాక పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉందని పీజీ చదవాలి అంటే విజయనగరం, విశాఖపట్నం వెళ్లవలసి వస్తుందని అందువల్ల పీజీ కాలేజ్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అలాగే బలిజిపేటలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నారు.