విజయనగరం: నగర అభివృద్దికి సహకరించాలి
ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె నగరపాలక సంస్థ అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.