యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఐటిడిఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ యువతకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తుందన్నారు. పట్టుదల, శ్రమ, కృషి ఉంటే సాధ్యం కానిది ఏది లేదని ఆయన పేర్కొన్నారు.