పార్వతీపురం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లోనూ పక్కా రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారం తెలియజేశారు.నర్సిపురం,కారాడవలస గ్రామాల్లో 60 లక్షల ఉపాధి నిధులతో సిసి రహదారి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజిపేట,పార్వతీపురం మండలాల్లో అవసరమైన చోట్ల సిసి రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.