ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కార్యక్రమంలో భాగంగా వందశాతం సౌర విద్యుత్ వినియోగంలోకి వచ్చిన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించిందని ఆదివారం విద్యుత్ సర్కిల్ ఎస్ఇ కె. చలపతిరావు చెప్పారు. ఇందు కోసం జిల్లాలో ఐదు మోడల్ గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో స్మార్ట్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య సముదాలయాలకు బిగించామన్నారు.