మన్యం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తొలుత విద్యార్థులు స్థానిక కాంప్లెక్స్ రోడ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు.