పూసపాటిరేగ మండలంలో జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ సోమవారం పర్యటించారు. ఎరికొండ తదితర గ్రామాలకు చెందిన డయేరియా బాధితులు పూసపాటిరేగ పిహెచ్సి లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రోగులను పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలను వైద్యులు రాజేష్ వర్మను అడిగి తెలుసుకున్నారు. పైపులైను లీకులతో త్రాగునీరు కాలుష్యం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.