నెల్లిమర్ల నియోజకవర్గంలోని సారిపల్లి పారిశ్రామికవాడలో ఒకప్పుడు వంద పరిశ్రమలు ఉండేవి, ఆ ప్రాంతం కార్మికులతో నిత్యం కళకళలాడేది కానీ, ప్రభుత్వాల ప్రోత్సాహం లేక.. నిర్వహణ భారంగా మారి ఒక్కో పరిశ్రమ మూతపడుతూ వస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 50కుపైగా పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులతో పాటు వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సారిపల్లి పారిశ్రామికవాడలో నిస్తేజం నెలకొంది.