ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నెల్లిమర్ల తాసిల్దార్ సుదర్శనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మండలంలోని రామతీర్థం జంక్షన్ వద్ద గల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఓటర్ నమోదు ప్రక్రియ పురోగతిని ఆయన బి ఎల్ ఓ లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డి టి వి వి ఆర్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.