ఈనెల 9, 10, 11 వ తేదీల్లో భోగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్ 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల నిర్వహణకు డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్ర రావు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు పాఠశాల పి ఈ టి లు చిన్నారి, నాగన్న గురువారం తెలిపారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొంది అర్హత సాధించిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పి ఈ టి లు తెలిపారు.