మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ తక్షణం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సంబంధిత పరికరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు.