పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో తాగు నీటి పరీక్షలు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్యం చక్కగా పాటించాలని ఆయన ఆదేశించారు.