కురుపాం ఎమ్మెల్యే, ప్రబుత్వ విప్ తోయక జగదీశ్వరీ సోమవారం అమరావతి సచివాలయంలో పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలసి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ శేఖర్ పాత్రుడు, టీడిపీ నాయకులు పి. వెంకట్ నాయుడు తదితరులు ఉన్నారు.