తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబీల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ. 32. 84కోట్లు కేటాయించింది. అలాగే, గిరిజన రహదారుల అభివృద్ధి పెద్దపీట వేసింది. దీనికి గాను నిధులను కేటాయించారు. ఇందులో రూ. 6. 20 కోట్లు భూ సేకరణకు, మరో రూ. 80 లక్షలు ఆర్ఆర్ప్యాకేజీ కోసం కేటాయించారు. మార్చి లోపు ఈ నిధులు ఖర్చు చేయవలిసి ఉంది.