ప్రేమ పేరుతో విశాఖలో లా విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కొమరాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు, జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖలో న్యాయ విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసిన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.