మెంటాడ మండలం జయితి గ్రామంలో వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని రాజాం సీఐ ఉపేంద్ర దర్శించుకున్నారు. శనివారం కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వామిఅమ్మవార్ల తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కాగా 11వ శతాబ్దంలో ఇంద్రుని కుమారుడు ఇంద్రజిత్ చే ప్రతిష్ట చేయబడిన మహిమగల శివాలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.