విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పురిటిపెంట, గంగచోళ్ళపెంట గ్రామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సీఎం పర్యటన భద్రత ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు పోలీసులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ప్రజల సహకారం అవసరమన్నారు.