బొబ్బిలి పట్టణంలో ఉన్న కామ్రేడ్ గంటి. ప్రసాదం స్మారక భవనంలో వామ పక్షాలు ఆధ్వర్యంలో సోమవారం ప్రొఫెసర్ సాయి బాబా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జీవితాంతం ప్రజల పక్షాన నిలిచిన నేరానికి అర్బన్ నక్సలైటుగా, మావోయిస్టు, యాక్టివిస్టు ముద్ర వేశారన్నారు. పదేళ్లు జైలు శిక్షలతో అనారోగ్యం పాలైన ప్రొఫెసర్ సాయి బాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు.