పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకొని బొబ్బిలి మండల, పట్టణ వ్యాప్తంగా సోమవారం ఉదయం శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ తీరాల్లో స్నానాలు ఆచరిస్తూ పూజలు చేశారు. మహిళలు పెద్దఎత్తున ఆలయాల్లో కార్తీకదీపాలు వెలగించి ముక్కంటిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి.