బొబ్బిలి మండలంలోని గదబవలస గ్రామంలో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను ఆ గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఉపాధిహామీ నిధులతో సుమారు 500 మీటర్ల మేర డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ రమేష్ తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంటు రోడ్ల పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.