వెంకటగిరి పోలేరమ్మ జాతరపై కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, ఎంపీపీ తనజా శివారెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరిలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర పండుగైన వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలందురు సహకరించాలని కోరారు.