తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎల్బీసీ కార్యాలయం సమీపంలో రహదారిపై గురువారం ఆక్రమణల పర్వం మళ్లీ మొదలైంది. రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కంటైనర్ బాక్సులు లాంటివి పెట్టుకొని దుకాణాలు ఏర్పాటు చేసి వేల రూపాయలకు బాడుగులకు ఇచ్చేస్తున్నారు. ఇటీవల రహదారి పక్కనే ఉన్న కంటైనర్ ను ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు తొలగింపు చేపట్టినా మళ్లీ యధావిధిగా ఆక్రమణలు చేపడుతున్నారు.