తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా అధ్యక్షతన మంగళవారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. మొదటిసారిగా నాయుడుపేట పురపాల సంఘానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.