వరదయ్యపాలెం: బీజేపీని గద్దె దింపే వరకూ పోరాటం

52பார்த்தது
వరదయ్యపాలెం: బీజేపీని గద్దె దింపే వరకూ పోరాటం
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం బస్టాండులో ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్ర హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. కార్మికుల హక్కులు కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకూ పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు బాలగురునాథ్, ఆటో వర్కర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி