శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధిలో బాలికపై అసభ్యకరంగా ప్రయత్నించిన ముని కన్నా అనే వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదివారం వన్‌టౌన్ సీఐ గోపి తెలిపారు. అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు చెప్పారు. ముద్దాయిది తొట్టంబేడు మండలం జ్ఞానమ్మ కండ్రిగన్నారు.