పిచ్చాటూరు: 26. 1 అడుగులకు చేరిన అరణియార్ ప్రాజెక్టు నీటిమట్టం

64பார்த்தது
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టులో 26. 1 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇరిగేషన్ అధికారులు ఆనకట్ట వద్ద పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆదివారం వేకువజామున 4 గంటలకు 2, 700 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టుకు వస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி