గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలంలోని డీఎం పురం ఆరోగ్య ఉపకేంద్రం పిచ్చి మొక్కల నిలయంగా మారిపోయింది. దీనితో విషపురుగులు, పాముల సంచారానికి నిలయంగా మారిందని స్థానికులు. ఆరోగ్య ఉపకేంద్రం పక్కన నివసించే ప్రజలు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి నూతన భవన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై సంబంధితbఅధికారులు త్వరితగతిన స్పందించాలని ప్రజలు అన్నారు.