తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని "సరిపోదా శనివారం" ఫేమ్ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద తెలుగు యువత నేత దిలీప్ రాయల్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.