మహిళల దయనిందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం-2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పాకాల మండలం, దామలచెరువు పంచాయితీలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నాని దీపం -2 మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రజల నుండి ఎమ్మెల్యే నాని వినతులు స్వీకరించారు.