సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి సంతబొమ్మాళి మండలం అంట్లవరం గ్రామంలో సైబర్ నేరాలు, పొక్సో చట్టం, డ్రగ్స్ పై గ్రామస్థులకు, యువతకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని, వ్యక్తిగత విషయాలు చెప్పకూడదని వివరించారు. ఈయనతో పాటు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం ఉన్నారు.